Header Banner

'ఎక్స్' వేదిక‌గా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. ఇందులో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపు!

  Thu Jun 05, 2025 12:59        Politics

ప్ర‌కృతి అంటే ఏ ఒక్క‌రి సొత్తు కాదని... ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉందంటూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. "అడ‌వుల‌ను కాపాడుకోవాలి. జ‌ల‌వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోవ‌డం మ‌న క‌ర్త‌వ్యం. అందుకే ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్రమం చేప‌ట్టింది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా నేడు ఒక్క‌రోజే ఒక కోటి మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి. మంచి ప‌రిస‌రాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా మ‌నం స్వ‌ఛ్చాంధ్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టాం. చెత్త‌ను ఇంధ‌నంగా మారుస్తూ ప్ర‌కృతిని కాపాడుతున్నాం. ఈ ఏడాది ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వంలో ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూల‌న అంశాన్ని థీమ్‌గా తీసుకోవ‌డం జ‌రిగింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి మ‌న వంతు బాధ్య‌త‌గా ప‌ని చేద్దాం. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంక‌ల్పం తీసుకుందాం" అని చంద్ర‌బాబు 'ఎక్స్' లో రాసుకొచ్చారు. కాగా, ఈరోజు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజధాని అమ‌రావ‌తిలో వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations